janasena singam
Breaking
కాకినాడ సర్లంకపల్లెలో ఘోర అగ్నిప్రమాదం అరుదైన ఘనత సాధించిన ఉపముఖ్యమంత్రి పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు మోకిలలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు విద్యార్థులు దుర్మరణం సంక్రాంతి ప్రయాణికులకు బిగ్‌షాక్‌.. పండుగ వేళ నిలిచిపోనున్న బస్సులు! చిరు – వెంకీ ఒకే స్టేజి మీద.. చిరు ముందు డ్యాన్స్ వేసిన వెంకటేష్.. పోలవరం పనులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష బంగాళాఖాతంలో అల్పపీడనం – చలి మధ్య వర్ష సూచనలు ఏపీలో మరో బస్సు ప్రమాదంప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్దం OG 2 : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి సెట్స్‌పైకి? ఫ్యాన్స్‌లో హైప్ విశాఖ ఎంపీ సీటు వైసీపీకి ఎందుకంత టెన్షన్? రాజమండ్రిలో ముగ్గుల పోటీలకు ఘనంగా తెరలేపిన ఆదిరెడ్డి శ్రీనివాసు
Logo
janasena singam
ఫేక్ ప్రచారం చేస్తున్నారు
ఎవరైనా హద్దులు దాటితే ప్రభుత్వం తరఫున కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వైసీపీ అధినేత **వైఎస్ జగన్ మోహన్ రెడ్డి**కు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా వైసీపీ నేతలు కావాలనే వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని పవన్ తీవ్ర విమర్శలు చేశారు. అవాస్తవాలు, ఫేక్ ప్రచారాలు మానుకోవాలని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలను ఇకపై తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏదైనా చెడగొట్టడం, కూలగొట్టడం చాలా సులభమని, కానీ నిర్మించడం మాత్రం చాలా కష్టమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.నేను రూల్స్ పాటిస్తాను.. నేను తప్పు చేసినా ఆ రూల్స్ మాకు వర్తిస్తాయి. పిఠాపురం వచ్చి గొడవలు పెడితే మాత్రం ఇక్కడకు వచ్చి అందరి మీద చర్యలు తీసుకుంటాను. నాకు ఓటమి భయం లేదు. నాకు, చంద్రబాబుకి మధ్య ఎటువంటి ఇబ్బందులు లేవు. గత 5 సవంత్సరాల కాలంలో పిఠాపురం ఏమి అభివృద్ధి జరిగింది? ఇప్పుడు ఏమి జరిగింది చూడండి. ఒక స్కూల్ లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్న అది న్యూసే. ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకుంటే అది కులాల గొడవ అంటారు. ఉప్పాడ ప్రొటెక్షన్ వాల్ కోసం మనం కష్టపడితే వచ్చింది. మీరు గొడవ పెట్టుకోవాలి అంటే నేను సిద్ధంగా ఉన్నా” అని పవన్ అన్నారు. శుక్రవారం పిఠాపురంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన ఆయన… ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే రాజకీయాలకు ఇక చోటు లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.