janasena singam
Breaking
కాకినాడ సర్లంకపల్లెలో ఘోర అగ్నిప్రమాదం అరుదైన ఘనత సాధించిన ఉపముఖ్యమంత్రి పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు మోకిలలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు విద్యార్థులు దుర్మరణం సంక్రాంతి ప్రయాణికులకు బిగ్‌షాక్‌.. పండుగ వేళ నిలిచిపోనున్న బస్సులు! చిరు – వెంకీ ఒకే స్టేజి మీద.. చిరు ముందు డ్యాన్స్ వేసిన వెంకటేష్.. పోలవరం పనులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష బంగాళాఖాతంలో అల్పపీడనం – చలి మధ్య వర్ష సూచనలు ఏపీలో మరో బస్సు ప్రమాదంప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్దం OG 2 : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి సెట్స్‌పైకి? ఫ్యాన్స్‌లో హైప్ విశాఖ ఎంపీ సీటు వైసీపీకి ఎందుకంత టెన్షన్? రాజమండ్రిలో ముగ్గుల పోటీలకు ఘనంగా తెరలేపిన ఆదిరెడ్డి శ్రీనివాసు
Logo
janasena singam
విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మరోసారి తన సత్తా చాటాడు. పంజాబ్ తరఫున బరిలోకి దిగిన అతడు సిక్కింకు ఎదురుగా జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని చిత్తు చేశాడు.
జైపూర్ వేదికగా జరిగిన ఈ పోరులో పంజాబ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ అర్ష్‌దీప్ సింగ్ ఇన్‌స్వింగ్, ఔట్‌స్వింగ్ బంతులతో సిక్కిం బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఫలితంగా అతడు ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చాడు. అర్ష్‌దీప్ దెబ్బకు సిక్కిం జట్టు 22.2 ఓవర్లలో కేవలం 75 పరుగులకే ఆలౌటైంది. అతడికి తోడు సుఖ్‌దీప్ బజ్వా, మయాంక్ మార్కండే చెరో రెండు వికెట్లు తీసి పంజాబ్ బౌలింగ్ ఆధిపత్యాన్ని మరింత పెంచారు. సిక్కిం బ్యాటర్లలో కొద్దిమంది మాత్రమే రెండు అంకెల స్కోరు చేయగలిగారు. చిన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన పంజాబ్ బ్యాటర్లు ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా 6.2 ఓవర్లలోనే వికెట్ నష్టంలేకుండా విజయం సాధించారు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అర్ధశతకంతో మెరిశాడు. ఈ విజయంలో అర్ష్‌దీప్ సింగ్ ప్రదర్శన మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.