తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు.
కొండగట్టు : తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శుభారంభం చేశారు.
భక్తుల సౌకర్యాల పెంపు లక్ష్యంగా టీటీడీ నిధుల ద్వారా రూ.35.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండపానికి పవన్ కల్యాణ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్టులతో కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులకు వసతి, సౌకర్యాలు మరింత మెరుగవుతాయని అధికారులు తెలిపారు.