తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అర్ధరాత్రి వేళ ఓ వ్యక్తి సృష్టించిన హంగామా కలకలం రేపింది. ఏకాంత సేవ పూర్తయ్యాక ఆలయ పరిధిలోకి వచ్చిన అతడు అకస్మాత్తుగా గోపురంపైకి ఎక్కడంతో అక్కడున్నవారు భయాందోళనకు గురయ్యారు
తిరుపతి : గోవిందరాజ స్వామి ఆలయంలో అర్ధరాత్రి ఉద్రిక్తత
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అర్ధరాత్రి వేళ ఓ వ్యక్తి చేసిన హంగామా కలకలం రేపింది. ఏకాంత సేవ పూర్తైన అనంతరం ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన అతడు, ఒక్కసారిగా గోపురంపైకి ఎక్కి నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
సమాచారం అందుకున్న వెంటనే విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని కిందకు దిగాలని పలుమార్లు సూచించారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి పోలీసుల మాటలను పట్టించుకోకుండా నిరాకరించాడు.
దీంతో సుమారు మూడు గంటల పాటు హైడ్రామా కొనసాగింది. చివరికి భద్రతా సిబ్బంది సమన్వయంతో అతడిని సురక్షితంగా కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.