janasena singam
Breaking
కాకినాడ సర్లంకపల్లెలో ఘోర అగ్నిప్రమాదం అరుదైన ఘనత సాధించిన ఉపముఖ్యమంత్రి పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు మోకిలలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు విద్యార్థులు దుర్మరణం సంక్రాంతి ప్రయాణికులకు బిగ్‌షాక్‌.. పండుగ వేళ నిలిచిపోనున్న బస్సులు! చిరు – వెంకీ ఒకే స్టేజి మీద.. చిరు ముందు డ్యాన్స్ వేసిన వెంకటేష్.. పోలవరం పనులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష బంగాళాఖాతంలో అల్పపీడనం – చలి మధ్య వర్ష సూచనలు ఏపీలో మరో బస్సు ప్రమాదంప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్దం OG 2 : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి సెట్స్‌పైకి? ఫ్యాన్స్‌లో హైప్ విశాఖ ఎంపీ సీటు వైసీపీకి ఎందుకంత టెన్షన్? రాజమండ్రిలో ముగ్గుల పోటీలకు ఘనంగా తెరలేపిన ఆదిరెడ్డి శ్రీనివాసు
Logo
janasena singam
ఈ అనుభవాలన్నీ తనను మరింత బలంగా మార్చాయని, కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని జీవితం నేర్పిందని ప్రియాంక సింగ్ పేర్కొన్నారు.
జబర్దస్త్ లాంటి కామెడీ షో ద్వారా ఎంతోమంది కొత్త టాలెంట్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొందరు కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకోగా, మరికొందరు డైరెక్టర్లు, హీరోలుగా కూడా సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. ముఖ్యంగా ఈ షోలో లేడీ గెటప్స్ వేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారిలో ప్రియాంక సింగ్ ఒకరు. లేడీ గెటప్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక, ఒకప్పుడు అబ్బాయిగా ఉన్నప్పటికీ పూర్తిగా అమ్మాయిలా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి మనసు విప్పారు. తన తండ్రికి మంచి కూతురిగా ప్రియాంకగానే మళ్లీ జన్మించాలని కోరుకుంటానని చెప్పిన ఆమె, తల్లిని కోల్పోయినా తనను పెంచి పెద్ద చేసిన పెద్దమ్మ తల్లి తనకు బలమైన అండగా నిలిచిందని తెలిపారు. గత 14 ఏళ్లుగా ప్రతి శుక్రవారం పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లడం తన జీవితంలో భాగమైందని, లలితా సహస్రనామం పఠిస్తూ, తులసికోట పూజ చేస్తూ చాలా సాదాసీదా జీవితం గడుపుతున్నానని ప్రియాంక చెప్పారు. పబ్‌లు, పార్టీలకు దూరంగా ఉండే తాను ఆధ్యాత్మికతతోనే ప్రశాంతత పొందుతానని వెల్లడించారు. ఇక జబర్దస్త్ షో విషయానికి వస్తే, తాను స్వయంగా షో మానలేదని, నిర్వాహకులే తనను బయటకు పంపించారని ప్రియాంక స్పష్టం చేశారు. లేడీ గెటప్‌లు ఎక్కువగా ఉండటంతో షోకి చెడ్డపేరు వస్తుందేమో అన్న భావన వారిలో ఏర్పడిందని, వారు అలా చెప్పగానే ఎలాంటి ప్రశ్నలు వేయకుండా వెంటనే తన సామాన్లు సర్దుకుని షో నుంచి బయటకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. షో నుంచి బయటకు వచ్చిన పది రోజుల్లోనే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆర్థరైటిస్ సమస్యతో దాదాపు ఏడాది పాటు మంచానికే పరిమితమయ్యారు. ఆ కష్టకాలంలో మెగా బ్రదర్ నాగబాబు తనకు అండగా నిలిచారని ప్రియాంక భావోద్వేగంగా తెలిపారు. ఆర్థికంగా, మానసికంగా ఆయన ఎంతో సహాయం చేశారని, ప్రతి నెలా మందులు, డబ్బు పంపించడమే కాకుండా రోజూ ఫోన్ చేసి తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేవారని కృతజ్ఞతతో చెప్పారు.