janasena singam
Breaking
కాకినాడ సర్లంకపల్లెలో ఘోర అగ్నిప్రమాదం అరుదైన ఘనత సాధించిన ఉపముఖ్యమంత్రి పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు మోకిలలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు విద్యార్థులు దుర్మరణం సంక్రాంతి ప్రయాణికులకు బిగ్‌షాక్‌.. పండుగ వేళ నిలిచిపోనున్న బస్సులు! చిరు – వెంకీ ఒకే స్టేజి మీద.. చిరు ముందు డ్యాన్స్ వేసిన వెంకటేష్.. పోలవరం పనులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష బంగాళాఖాతంలో అల్పపీడనం – చలి మధ్య వర్ష సూచనలు ఏపీలో మరో బస్సు ప్రమాదంప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్దం OG 2 : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి సెట్స్‌పైకి? ఫ్యాన్స్‌లో హైప్ విశాఖ ఎంపీ సీటు వైసీపీకి ఎందుకంత టెన్షన్? రాజమండ్రిలో ముగ్గుల పోటీలకు ఘనంగా తెరలేపిన ఆదిరెడ్డి శ్రీనివాసు
Logo
janasena singam
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరచుకున్నాయి. స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు.
తిరుపతి, డిసెంబర్‌ 30: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారం తెరచుకుంది. సోమవారం అర్ధరాత్రి 12:05 నిమిషాలకు వైకుంఠ ద్వార తలుపులను తెరిచారు. దర్శనాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయి. అర్చక స్వాములు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. 1.20 మధ్యలో ప్రముఖుల దర్శనాలను ప్రారంభించారు. ఉదయం 5:30 నిమిషాలకు డిప్ కలిగిన టోకెన్లు అనుమతిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టోకెన్లు లేని భక్తులను జనవరి 2నుంచి నేరుగా రావాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాని పేర్కొన్నారు. ఈ మూడు రోజులు టోకెన్లు ఉన్న భక్తులు టోకెన్ లో ఉన్న సమయానికే తిరుమలకు రావాలని సూచించారు. భక్తులు ఆధార్‌ కార్డుతో పాటు డిప్‌లో కేటాయించిన టోకెన్‌ ప్రింట్‌కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. అనుకున్న దాని కన్నా ముందుగానే దర్శనాలు ప్రారంభించామని, ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు. కనివిరిగని రీతిలో వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లు చేశాం. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఉత్తర ద్వార దర్శనాలు కల్పించాం. భక్తులందరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది సేపట్లో టోకెన్లు ఉన్న భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆయన అన్నారు. వైకుంఠ ద్వార దర్శనం మొదలవగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దర్శనం చేసుకున్నారు. అలాగే సినీనటుడు నారా రోహిత్ దంపతులు, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, సినీ నిర్మాత డివివి దానయ్య, మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, కూతుళ్లు సుస్మిత, శ్రీజ, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, రాష్ట్ర శాసన సభాపతులు అయ్యన్నపాత్రుడు, రఘురామ కృష్ణంరాజు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రులు అచ్చం నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, సవిత, నిమ్మల రామానాయుడు, నటుడు శివాజీ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు, మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, టీం ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, మేనేజింగ్ డైరెక్టర్ సుచరిత ఎల్లా తదితరులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.